కెసిఆర్ కు చెమటలు పట్టిస్తున్న జగన్ నిర్ణయాలు ఏంటవి

ysjagan kcr updates

వయసు చిన్నది బాధ్యత పెద్దది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి జగన్ పై చేసిన వ్యాఖ్య ఇప్పుడు కెసిఆర్ కి పదే పదే గుర్తుకు తెచ్చేలా చేస్తున్నారు వైస్ జగన్ ఏదైనా జగన్ మీద ఈ వ్యాఖ్యలు చేసి కెసిఆర్ తప్పులో కాలేశారని చెప్పాలి ఏపీ ప్రజలు మాత్రం సీఎం పదవి చేపట్టడానికి వయస్సు కంటే సమర్ధతే ముఖ్యమని గుర్తించారు కానీ కెసిఆర్ మాత్రం జగన్ ని అర్ధం చేసుకోవడంలో విఫలం అయ్యారనే చెప్పాలి

జగన్ వయసులో చిన్నవాడు మనం చెప్పినట్లు వింటాడన్న భావన తెరాస ముఖ్యనేతల్లో ఉండేదన్న భావన పార్టీ వర్గాలు తమ అంతర్గత సంబాషణల్లో వినిపిస్తుంటాయి కానీ ఇప్పుడు మాత్రం జగన్ ప్లానింగ్ చూస్తుంటే ఏ మాత్రం ఊహించని రీతిలో ఉందని జగన్ తీరు చూస్తుంటే కెసిఆర్ కు సైతం చెమటలు పట్టిస్తున్నాయన్న మాట రాజకీయ వర్గాల్లో అంతకంతకు పెరుగుతుంది

కెసిఆర్ మాత్రం జగన్ స్పీడ్ కి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు గా అర్ధం అవుతుంది ఇటీవల కాలంలో జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కెసిఆర్ ని మరింత ఒత్తిడికి గురి చేయడంతో పాటు కచ్చితంగా ఆ నిర్ణయాలను పాటించి తీరాలి అనే విధంగా ఉందంటున్నారు గడిచిన మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని వేరు వేరు ప్రాంతాల్లో ధర్నాలు ఆందోళనలు జరుగుతున్నాయి వీటన్నిటికీ కారణం అక్కడ ఏపీలో జగన్ తీసుకున్న నిర్ణయాలే కావడం కావడం గమనార్హం

మొన్నటివరకు చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నంతవరకు కెసిఆర్ తన యొక్క దూకుడు నిర్ణయాలతో ముందుకు సాగారు ఇప్పుడు మాత్రం అందుకు పూర్తి భిన్నమైన అనుభవం కెసిఆర్ కు ఎదురవుతుంది ఉద్యోగులకు 27 శాతం ఐ ఆర్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం లకు సంబందించి జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలను కెసిఆర్ కూడా తప్పనిసరిగా ఫాలో కాక తప్పని పరిస్థితి కెసిఆర్ మాత్రం ఐ ఆర్ ని 27 శాతం పెంచటానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు అనే తెలుస్తుంది ఆలా అని పెంచకుండా ఉంటే విమర్శలకు గురి కావడం ఖాయం

ఏది ఏమైనప్పటికి ఏపీ కొత్త సీఎం జగన్ మాత్రం తన దూకుడు నిర్ణయాలతో తెలంగాణ సీఎంకు కొత్త సవాళ్ళను సమస్యలను తీసుకొస్తున్నట్లుగా చెప్పక తప్పదు ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో పెద్ద ప్రశ్న గా మారటమే కాక తెరాస నేతల్లో కొత్త భయాన్ని నిద్ర లేపుతున్నట్టు గా కూడా తెలుస్తుంది నాకు ఇంకెవ్వరితో సంబంధం లేదన్నట్టు జగన్ తీరు ఉంది ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే జగన్ కెసిఆర్ కి కొత్త ఇబ్బంది గా మారారని చెప్పక తప్పదు