ఇక గాల్లో తేలనున్న “జొమాటో”.. డ్రోన్ ద్వారా ఫుడ్ డెలివరీ..

zomato drone food delivery

zomato drone food delivery

జొమాటో” అంటే తెలియని వారు బహుశా ఇప్పుడు ఎవరు ఉండరేమో ఇది ఒక పాపులర్ ఫుడ్ డెలివరీ సర్వీస్ అని అందరికి తెలుసు అయితే ఇప్పుడు జొమాటో ఒక వినూత్న ఆలోచనతో సంచలనం సృష్టించబోతోంది అదేంటంటే హైబ్రిడ్ డ్రోన్లతో తాము ఫుడ్ డెలివరీ చేయబోతున్నాం అని ప్రకటించి తమ కంపెటిటర్లతో సహా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది

డ్రోన్ల ద్వారా ఆహార పదార్దాలను డెలివరీ చేసే ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించి సరికొత్త రికార్డును సృష్టించింది ఈ యొక్క హైబ్రిడ్ డ్రోన్ కేవలం 10 నిమిషాల్లో 5 కిలోమీటర్లు ప్రయాణించగలదని జొమాటో తెలిపింది ఈ డ్రోన్ గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడమే కాక 5 కిలోల బరువు కలిగిన ఆహారాన్ని తీసుకెళ్లగలదని కంపెనీ తెలిపింది పౌర విమానయాన నియంత్రణ మండలి DGCA పరిధిలోని ఒక నియంత్రణ ప్రాంతంలో ఈ పరీక్షను జొమాటో నిర్వహించింది

రోడ్డు మార్గం కంటే ఆకాశ మార్గాన మరింత వేగవంతంగా ఫుడ్ డెలివరీ చేయాలనే ఉద్దేశంతో ఈ నూతన సర్వీసుకు శ్రీకారం చుట్టినట్టు కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు , సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు దీనికి టెక్నాలజీ అంత సిద్ధంగా ఉన్నప్పటికీ నియంత్రణ మండళ్ల అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం అని తెలియచేసారు

కాగా గత సంవత్సరం డిసెంబర్ లో జొమాటో డ్రోన్ సేవలు అందించేందుకు లక్‌నవూకు చెందిన స్టార్టప్‌ టెక్‌ఈగల్‌ను కొనుగోలు చేసింది డ్రోన్లలో పొందుపరచిన సెన్సారుకు కంప్యూటర్ సెన్సారుతో అనుసంధానం చెయ్యడం ద్వారా ఫుడ్ ని డెలివరీ చేసే ప్రాంతాన్ని ముందుగానే గుర్తించి డెలివరీ చేయవచ్చని తెలిపారు

zomato drone food delivery