“పెళ్ళి”చేసుకోబోతున్న… ప్రభాస్, హీరోయిన్

 

prabhas

తెలుగు సినీ పరిశ్రమలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన
లీడ‌ర్‌ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రిచా గంగోపాధ్యాయ. ఇక పై సినిమాలకు దూరంగా ఉండబోతున్నారు. తన అందం అభినయంతో అచ్చం తెలుగమ్మాయిలా పలు తెలుగు సినిమాల్లో న‌టించిన ఈ బ్యూటీ మిర‌ప‌కాయ్‌, మిర్చి, భాయ్, సారొచ్చారు, నాగవల్లి,వంటి సినిమాల్లో హీరోయిన్ గా న‌టించి మెప్పించింది. అలాగే త‌మిళం, బెంగాళీల్లో కూడా ఇంకొన్ని సినిమాలు చేసింది ఈ అమ్మడు. గత కొంత కాలంగా తను సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఈ బ్యూటీ. అమెరికా వెళ్లిపోయి వెండితెర‌కు దూరమైంది.

 

richa

అయితే  అమెరికా వెళ్ళాక ‘ రీచా గంగోపాధ్యాయ్’యుఎస్‌లో బిజెనెస్ స్కూల్‌లో చదువుతున్న సమయంలో …అక్కడే తనతో పాటు చదువుకుంటున్న ‘జోయ్ లంగేల్లతో’ పరిచయం కావడం.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం.. దీని అనంతరం వారిద్దరి కుటుంబాలను పెళ్ళికి ఒప్పించి ….త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు. రీసెంట్ గా ఆమె ప్రియుడు జోయ్ లంగేల్లతో అమెరికాలో నిశ్చితార్థం జరిగింది. ఇలా తనకు కాబోయే భర్త జోయ్ తో కలిసి దిగిన ఫోటోను రీచా తన ట్విట్టర్‌ ద్వారా షేర్ చేసింది.ఈ పోస్ట్ లో ‘నాకు నిశ్చితార్థం జరిగింది’. ఈ సందర్భాన్ని మీతో పంచుకుంటున్నాను అని తన మనస్సులోని సంతోషాన్ని తన అభిమానులతో, శ్రేయోభిలాషుల తో పంచుకోవడం జరిగింది.తను, జోయ్‌‌ బిజినెస్‌ స్కూల్‌లో కలుసుకున్నాం అని. అలా అక్కడ తనతో ఉన్న రెండు ఏళ్ళు చాలా ఆనందంగా గడిచాయి. నా జీవితంలో ముందు జరగబోయే మరిన్ని అద్భుతమైన క్షణాల కోసం ఎదురుచూస్తున్నాను అని….ఇంకా మ్యారేజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు’ డేట్ కన్ఫర్మ్ అయ్యాక మిగిలిన విషయాల గురించి చెబుతాను అని ట్వీట్ చేసింది రీచా. ఈ విషయం తెలిసిన అనంతరం చాలా మంది సెలబ్రెటీలు,నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియచేశారు.