చంద్రబాబు తో పోటీపడే సత్తా జగన్ కు లేదు : రామ్మోహన్

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పోటీపడే సత్తా ప్రతిపక్ష నేత జగన్‌కు లేదని టీడీపీ ఎంపీ కింజరాప్ రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఆయన మాట్లాడుతూ…. యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని తెలిపారు. 2019లో చంద్రబాబు అధికారంలోకి రావాలంటే యువత కదనరంగంలోకి దిగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం కోసం చంద్రబాబు పడుతున్న కష్టాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. చంద్రబాబు పేరు రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష అని రామ్మోహన్ నాయుడు చెప్పారు.