సాయిధరమ్‌ తేజ్ ఈసారైనా హిట్ కొట్టేనా…

Sai Dharam Tej, Telugu Vilas

Sai Dharam Tej Chitralahari Movie Detailsసాయిధరమ్‌ తేజ్ హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. ఈ చిత్రం షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తుంది. ఇప్పటివరకు శ్రీమంతుడు, జనతాగ్యారేజ్‌, రంగస్థలం వంటి హిట్‌ చిత్రాల నిర్మించింది ఈ సంస్థ. అయితే దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రలహరి సినిమా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ ఇవ్వగా, సాయిధరమ్‌ అమ్మగారు విజయ కెమెరా స్విచాన్‌ చేశారు.

Also Read: — ఎన్టీఆర్ కెరీర్‌లో ది బెస్ట్ మూవీ అని తేల్చేసిన రాంచరణ్ … వారిద్దరూ అరవింద సమేతకు పిల్లర్లు..!

Sai Dharam Tej, Telugu Vilas

Also Read: — రంగస్థలాన్ని దాటినా అరవింద సమేత….!

ఆ తరువాత ఈ చిత్ర నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి మాట్లాడుతూ మా బ్యానర్ లో వస్తున్నా నాల్గొవ చిత్రం ఇది. గతంలో మెగా హీరో రామ్‌చరణ్‌తో రంగస్థలం నిర్మించాం, ఇప్పుడు అదే ఫ్యామిలికి చెందిన సాయిధరమ్‌ తేజ్‌తో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది అని అన్నారు. ఈ చిత్రంలో సాయిధరమ్‌ తేజ్‌ సరసన హలో ఫేమ్ కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కూల్‌, ఎమోషనల్‌, హార్ట్‌ టచింగ్‌ పాయింట్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్‌ మొదటివారం నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రానికి సంబందించిన ఇతర విషయాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు అన్నారు.

Sai Dharam Tej , Telugu Vilas

Also Read: — NTR’s Aravinda Sametha Collects Record Collections In Two Days