రానున్న ఎన్నికల్లో “వై.ఎస్.జగన్” సీఎం కావడం ఖాయం….” పోలీస్ సర్వే చేసిన ఉండవల్లి”

 

undavalli,jagan

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ గెలుపు పిలుపు కోసం ప్రతి పార్టీ కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుల వరకు “ఒకటే మత్రం తత్రంలా “పని చేయనుంది. అందులో భాగంగానే ప్రముఖ రాజకీయ నాయకుడు ఒకప్పటి మాజీ మంత్రి చిలక జోస్యం కి బదులుగా పోలీస్ జోస్యం చెబుతున్నారు. రానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కచ్చితంగా వై యస్ జగన్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాడు అని ఆయన కల కండిగా చెబుతున్నారు.

ఏ పార్టీ నాయకుడికి అయిన అత్యంత పారదర్శకం గా పని చేసే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ నాయకుల కు రక్షణ కల్పించే విషయంలో ముందుంటారు. అయితే వారిని దృష్టిలో పెట్టుకొని ఉండవల్లి కొన్ని బలమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అధికారంలో ఉన్న వ్యక్తులకు సెల్యూట్ చేయడం లేదంటేనే ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రాదని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అని. అదే ప్రతి పక్ష నేతకు సెల్యూట్ చేసి తమ గౌరవాన్ని తెలియపరుస్తూ ఉంటే … దీన్ని బట్టే అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బలం ఆయన ప్రజల్లో ఉన్న స్థానం.

ఈ రకంగా చూసుకుంటే వై.యస్ రాజశేఖర్ రెడ్డి కంటే కూడా వై.యస్ జగన్ మంచి వక్త అని తండ్రి నీ మించిన తనయుడు గా ఆయన జగన్ యెక్క గొప్పతనాన్ని మరో మారు ఆయన మాటల ద్వారా అధికార పార్టీ నీ హెచ్చరించే విధంగా ప్రజల్లో తమకున్న పట్టును తెలియ జేసే విధంగా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. చూడాలి మరి రానున్న ఎన్నికల్లో వైకాపా ఎలాంటి పోటీ ఇస్తుందో….